Supreme Court : ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కు వాయిదా

Supreme Court
Supreme Court : ఓటుకు నోటు కేసును సుప్రంకోర్టు జూలై 24కు వాయిదా వేసింది. ఈ కేసులో నారా చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చి జీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ తరపు న్యాయవాది సమయం కోరారు.
మరోవైపు సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు లాయర్ కోరారు. దీంతో సుప్రీం కోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎస్ భట్టిల ధర్మాసనం తెలిపింది.