Srivari Devotees : శ్రీవారి భక్తులకు గమనిక.. 13న కైశిక ద్వాదశి ఆస్థానం
Srivari Devotees : తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక. ఈ నెల 13న టీటీడీ సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహించనుంది. ప్రతి ఏటా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలుస్తూ.. కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యాదయానికి ముందు మాడ వీధులలో ఘనంగా ఊరేగిస్తారు. శ్రీ మహా విష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా చెబుతుంటారు. ఈ వేడుక ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు.
కైశికద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీ మహా విష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు.