JAISW News Telugu

Jagan-Chandrababu : వాళ్లు వీళ్లు కాదు.. జగనే చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్.. ఇదే కదా నిజం..

Jagan is the star campaigner for Chandrababu

Jagan is the star campaigner for Chandrababu

Jagan-Chandrababu : సీఎం వైఎస్ జగన్  నోరు విప్పితే చాలు వచ్చేది చంద్రబాబు పేరే. ఆయనను తలుచుకోనిదే జగన్ కు ఒక్క క్షణం కూడా గడవదు. ఇక ఇతర పార్టీల నేతలను చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లని ట్రోల్ చేస్తుంటాడు.. కానీ చంద్రబాబుకు తానే పెద్ద స్టార్ క్యాంపెయినర్ అని సంగతి ఆయనే మరిచిపోతున్నారు. తన విషయంలో జరిగే ప్రతీ విషయానికి చంద్రబాబుతో ముడిపెట్టి అంతర్జాతీయ అంశాల వరకూ చంద్రబాబే చేయించాడని ప్రచారం చేస్తుంటారు జగన్ రెడ్డి.  చంద్రబాబుకు ఆయన కన్నా పెద్ద స్టార్ క్యాంపెయినర్ ఉంటారు?

ఇంట్లో విషయాలకు చంద్రబాబే..
తల్లి, చెల్లి వదిలేసి వెళ్లిపోయారు.. దానికీ చంద్రబాబే కారణం. కుటుంబంలో చిచ్చు పెట్టేశారని ప్రచారం చేసుకుంటారు. గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు జగన్ కోసం షర్మిల ప్రచారంలో చేశారు. గత ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేసేవారు. నిజంగా జగన్ సొంత చెల్లినే  ప్రభావితం చేయగలిగే రేంజ్ లో చంద్రబాబు ఉంటే.. మరి జగన్ మాత్రం ప్రభావితం కాకుండా ఎలా ఉంటారు. మొత్తంగా ఏం జరిగినా చంద్రబాబే అంటే.. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ గా ఎప్పుడో మారారు జగన్ రెడ్డి.

చంద్రబాబు బలం జగన్ కే ఎరుక..
బీజేపీ వెనక చంద్రబాబు ఉన్నాడు..సీబీఐ వెనక చంద్రబాబు ఉన్నాడు.. కాంగ్రెస్ వెనక చంద్రబాబు ఉన్నాడు.. కోర్టు తీర్పుల వెనక చంద్రబాబు ఉన్నాడు.. ఇలా లెక్కలు వేస్తే చంద్రబాబును బహుబలిగా ప్రపంచానికి చాటుతున్నది జగన్ రెడ్డే. చంద్రబాబు ఇంత బలవంతుడా ? మాకు తెలియదే.. అని వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయేంత బలం ఆపాదిస్తూ.. స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తోంది జగన్ రెడ్డే.

జగన్ చేతికానితనమే..
యువకుడు ఓ సారి అవకాశం ఇద్దామని.. ప్రజలు గెలిపించి సీఎంను చేస్తే జగన్ రెడ్డి చేసిన నిర్వాకం చూసి ప్రజలు చంద్రబాబును ఎందుకు ఓడించామో కదా అని రియాలైజ్ అవుతున్నారు. ఈ రియాలైజ్ కూడా కారణం ఎవరు జగన్ రెడ్డే. అదే చంద్రబాబు ఉంటే అనిపించేలా ప్రతీ సారి అందరితో అనిపిస్తున్నది ఎవరు? ఇంకెవరూ జగన్ రెడ్డే. ఇంతకన్నా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ ఎవరుంటారు. ఎన్నో ఆశలతో పట్టం కట్టిన ప్రజల ఆశల్ని కూల్చేసి .. చంద్రబాబు ఉంటే బాగుండు అనిపించేలా చేసిన స్టార్ క్యాంపెయినర్ జగన్ రెడ్డి.

జగన్ రెడ్డి ఎలా తన పార్టీ కోసం పనిచేసుకుంటాడో..పురందేశ్వరి, షర్మిలతో సహ ఇతర పార్టీల నేతలు తమ తమ పార్టీ కోసం పనిచేసుకుంటూ ఉంటారు. వారేమీ చంద్రబాబు కోసం పనిచేయరు. కానీ నిరంతరం చంద్రబాబు కోసం పనిచేసేది..ప్రచారం చేసేది జగన్ రెడ్డి మాత్రమే.. ఇది కాదంటారా?

Exit mobile version