PM Modi : ఉత్తరాది మాత్రమే కాదు.. దక్షిణాది కూడా మాతోనే ఉంది..400 సీట్లు వస్తాయని అందుకే చెప్తున్నా: ప్రధాని మోదీ

PM Modi

PM Modi

PM Modi : లోక్‌సభ ఎన్నికల తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూస్ 18కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూస్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి, తదితర సంపాదక బృందం  ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. మోదీ చెప్పిన సమాధానాల సారంశం ఇలా ఉంది..

ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలే కాక ఈ ఎన్నికల్లో దక్షిణాది నుంచి తమకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. బీజేపీ ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. తాము హ్యాట్రిక్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామన్నారు.

ఇండియా కూటమికి స్పష్టమైన దిశానిర్దేశం లేదని, మోడీని ఎదిరించి గెలవవచ్చని వారు భావిస్తున్నారు. అయితే, ఇండియా కూటమిలో విశాలమైన దేశం, దేశం ఆకాంక్షలను నిజం చేసే పేరును వారిలో ఒక్కరైనా ఉన్నారా అనే సందేహం ఓటర్లలో ఉంది. ఇంతవరకు వారు ప్రధాని పేరునే ప్రకటించలేదు. ఇండియా కూటమి వస్తే సంవత్సరానికో ప్రధానిని పెట్టాలని వారు భావిస్తున్నారని తాను పేపర్లలో చదివానని ఎద్దేవా చేశారు. ఒక సంవత్సరంలో ఏ పాలకుడైనా దేశంలో ఉన్న సమస్యలను, సంక్లిష్టతలను ఎలా చేసుకుంటారని విమర్శించారు.

‘‘నేను ఇప్పుడు 400 పార్ గురించి మాట్లాడ‌డం లేద‌ని విపక్షాలు అంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అజెండా కేవలం వారి సీట్లు గెలవడమే కాదు.. మేము (బీజేపీ) 400 సీట్లు గెలుస్తామా లేదా అనేది వారి ఎజెండా. నేను భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించాను. బీజేపీ తుఫాన్ సృష్టించబోతుందని చెప్పగలను. సులభంగా 400 సీట్ల మార్కును దాటబోతున్నాం..’’ అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామమందిరానికి సంబంధించిన నిర్ణయాన్ని మార్చుకుంటామనే ప్రకటనలు కూడా విన్నామని మోదీ తెలిపారు. ఇది తాను చెప్పేది కాదని కాంగ్రెస్ వాళ్లే చెప్పారని అన్నారు. ఇలాంటి అంశాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలనేది ఇండియా కూటమి చూస్తోందన్నారు. రామమందిరంపై మా నిబద్ధత అచంచలమైనదన్నారు. కూటమికి చెందిన లాలూ యాదవ్ రిజర్వేషన్లన్నీ ముస్లింలకే దక్కాలని అన్నారు.. కానీ మన రాజ్యాంగం మతం ఆధారంగా వివక్షను నిషేధించింది. పండిట్ నెహ్రూ కూడా ఈ సూత్రాన్ని సమర్థించారని తెలిపారు.

TAGS