ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు భారీగా ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. వడ్డీలేని రుణాలు మంజూరు చేయడంతో పాటు వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందించనుందని స్పష్టం చేశారు. టీజీఎస్ ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు వారితోనే బస్సులు కొనుగోలు చేయిస్తామని వెల్లడించారు. వాటిని ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి.. వాటి ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.
ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ములుగా భావిస్తుందని ఉపముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందుకు అందుకు అవుతున్న ఖర్చున రూ. 400 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తున్నదని భట్టి వెల్లడించారు.