Chandrababu : కేసీఆర్ లా కాదు.. చంద్రబాబును చూసి నేర్చుకో..

Chandrababu

MP Aravind

Chandrababu : నిజామాబాద్ బీజేపీ ఎంపీ డీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ను ఫాలో కావొద్దని సూచించారు. కేసీఆర్ రైతులకు ఎంతో అన్యాయం చేశారని, రేవంత్ కూడా ఆయనను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నదని మండిపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావించారు. ఏపీలో చంద్రబాబు నాయడు సుపరిపాలన అందిస్తున్నారని, రైతులకు మంచి చేసేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పారు. పొరుగు రాష్ర్టంలో సుపరిపాలనను ప్రజలు పొందుతున్నారని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు దార్శనికతతో ఆ రాష్ర్ట ప్రజలు మరోసారి సుభిక్ష పాలనను అందుకుంటున్నారని పేర్కొన్నారు.

ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, పెద్ద పెద్ద సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేలా ఆయన ఒప్పందాలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. అ యితే తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం హామీలు అమలు చేయడంలో కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్ వాయి మండలం గన్నారంలో ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రైతాంగం పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. కేసీఆర్ పాలనలో నూ రైతాంగం పరిస్థితి ఇదే తీరుగా ఉండేదని చెప్పారు. రుణమాఫీ అమలులో ఇద్దరూ విఫలమయ్యారని మండిపడ్డారు.

ఏపీలో రిలయన్స్, టాటా, అదానీ లాంటి కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అటు కేంద్రం నుంచి కూడా సంపూర్ణ మద్దతు  అందతున్నది. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. అయితే ఏపీ అర్వింద్ గత కొంత కాలంగా సీఎం రేవంత్ పై విమర్శల వేడి తగ్గించారు. తాజాగా ఆయన చంద్రబాబును పొగుడుతూ, సీఎం రేవంత్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు.

TAGS