JAISW News Telugu

YS Jagan : అర్జునుడు కాదు అపజయుడే..జగన్ ఎన్ని‘కలలు’ కన్నా జరిగేది ఇదే..

YS Jagan

YS Jagan

YS Jagan : ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రామాయణం, మహాభారతం లాంటి కథల్లో పాత్రలను ఆపాదిస్తున్నారు. జగన్ తాను అభిమన్యుడిని కాదని అర్జునుడినని చెబుతున్నారు. షర్మిల మాత్రం జగన్ ను కుంభకర్ణుడిలా సంబోధిస్తోంది. జగన్ అర్జునుడు కాదు శిఖండి అని జనసేన వర్ణిస్తోంది.

జగన్ ఏనాడు కూడా బయటకు రాలేదు. ప్రజలను కలవడానికి ఇష్టపడలేదు. జనంలో కలిసి తిరగలేదు. దీంతో ప్రజలతో మమేకం కాలేదు. సహజంగానే జగన్ పై ప్రజల్లో అసహనం పెరిగింది. మౌనమే సమాధానంగా ఉంటారు. కోడికత్తి కేసుపైనా విచారణకు హాజరు కాలేదు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయమే అంటున్నారు.

దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రజలను ఆకలి చావులకు గురిచేశారు. మూడు రాజధానుల పేరిట రాజకీయం చేసి ప్రజలకు దూరం అయ్యారు. ఈ ఎన్నికల్లో జగన్ తీరును ఎండగట్టి ఇంటికి సాగనంపాలని చూస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని జగన్ కు బుద్ధి చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ సమస్యల మీద ఏనాడూ స్పందించలేదు. సమస్యలకు పరిష్కారం లభించలేదు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెబుతూ కాలయాపన చేశారు. నిరుద్యోగుల జీవితాలపై నీళ్లు చల్లారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినా కుదరలేదు. దీంతో జగన్ పై వ్యతిరేకతలే వచ్చాయి. ఈనేపథ్యంలో జగన్ ఇప్పుడు గెలుపు ముంగిట నిలవడం కష్టమే.  

2019 తరువాత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఎటు చూసినా గుంతలే దర్శనమిచ్చాయి. ఎక్కడ కూడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. రోడ్ల గురించి జనసేన కూడా ఆందోళన చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో జగన్ కు విజయం అంత సునాయాసం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Exit mobile version