CM Chandrababu : త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ: చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : పార్టీ కోసం కష్టపడిన వారి కోసం త్వరలోనే నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపించే కార్యక్రమం ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ గెలవని సీట్లలో కూడా టీడీపీకి ప్రజలు పట్టం కట్టారంటే అది వారు మనమీద పెట్టుకున్న నమ్మకమి తెలిపారు. కూటమిలోని మూడు పార్టీల పాత్ర ఎంతో కీలకంగా పనిచేసిందని అన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.