Nokia : నోకియా.. చంద్రుడిపై 4జి నెట్ వర్క్
Nokia : ఈ ఏడాదిలో చంద్రుడిపై 4జి నెట్ వర్క్ స్థాపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా చేతులు కలిపాయి. ఇది భవిష్యత్తులో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఓ మైలురాయి కానుంది. రానున్న రోజుల్లో నెట్ వర్క్ పరికరాల కోసం నోకియా స్పేస్ ఎక్స్ రాకెట్లను లాంచ్ వెహికల్ గా ఉపయోగించబోతుందని నోకియా బెల్ ల్యాబ్స్ కి చెందిన ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిసయ్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో తెలిపారు.
భవిష్యత్తులో సర్వ సాధారణం కానున్న అంతరిక్ష యాత్రలకు నెట్ వర్క్ కనెక్టివిటే అందించడం సాధ్యమయ్యే విషయమేనని నిరూపించాలని నోకియా భావిస్తోంది. 4జీ నెట్ వర్క్ సాయంతో వ్యోమటీములు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చని, అలాగే అవసరమైతే రిమోట్ గా రోవర్ ను కూడా నియంత్రించవచ్చని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా రియల్ టైమ్ వీడియో ఫుటేజీతో పాటు ఇతర డేటాను కూడా కంట్రోల్ సెంటర్ కు పంపవచ్చునని కంపెనీ తెలిపింది.