India TV-CNX Opinion Poll : ఎన్డీఏకు తిరుగులేదా? ఏపీ, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

India TV-CNX Opinion Poll

India TV-CNX Opinion Poll

India TV-CNX Opinion Poll : రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు ఎదురులేదని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారని ‘ఇండియా టీవీ -సీఎన్ఎక్స్’ ఒపీనియన్ పోల్ నివేదిక వెల్లడించింది. ఎన్నికలు జరిగే మొత్తం 543 సీట్లలో అధికార ఎన్డీఏ కూటమి ఏకంగా 378 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇండియా కూటమి(తృణమూల్ లేకుండా) కేవలం 98 సీట్లను మాత్రమే గెలుస్తుందని చెప్పింది. ఈ నివేదిక బుధవారం వెల్లడైంది.

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనూహ్యంగా 7 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయనుంది. గుజరాత్ లోని మొత్తం 26 స్థానాల్లో జయకేతనం ఎగురవేయనుంది. అలాగే మధ్య ప్రదేశ్ (29), రాజస్థాన్ (25), హర్యానా (10), ఢిల్లీ (7), ఉత్తరాఖండ్ (5), హిమచల్ ప్రదేశ్ (4)లలో క్లీన్ స్వీప్ చేయనున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ బెంగాల్ లోని 42 సీట్లకు గాను 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. తమిళనాడులోని 39 సీట్లకు అధికార డీఎంకే 20లో, ఏపీలోని వైసీపీ 15, టీడీపీ 10, ఒడిశాలోని 21 స్థానాలకు బీజేడీ 10 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉండగా, అధికార కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించనున్నాయి. ఏపీలోని 25 స్థానాల్లో అధికార వైసీపీ 15, టీడీపీ 10 సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

TAGS