JAISW News Telugu

BJP : బీజేపీలో కాపులకు నో టికెట్..ఎందుకిలా చేశారు?

BJP

BJP

BJP : ఏ రాష్ట్రంలో లేనట్టుగా కుల రాజకీయ సమీకరణాలు ఏపీలో ఉంటాయని జనాలు చెప్పుకుంటుంటారు. రాజకీయాల్లో కులానికి ఎంతో ప్రాధాన్యముంటుందని చెప్పవచ్చు. మా కులపోడికి మాత్రమే ఓటేస్తామనే వాళ్లు కోకొల్లలు. ఇక జనం వైఖరి ఇలా ఉంటే రాజకీయ నేతలది మరోలా ఉంటుందా? వారు కూడా అంతే..సీట్ల కేటాయింపులో కులానికే ప్రాధాన్యం. ఏ నియోజకవర్గంలో ఏ కుల జనాభా ఎక్కువుంటుందో వారికే సీటు ఇస్తారు. ఈ వైఖరి ఇప్పటికీ ఉండడంతో రాజకీయాల్లో కులం పాత్ర మరింతగా పెరుగుతుందనే చెప్పవచ్చు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి ఏపీలోనూ టీడీపీ అంటే కమ్మ, కాంగ్రెస్ లేదా వైసీపీ అంటే రెడ్లు, జనసేన అంటే కాపు అని జనాలు నిర్వచనం చెపుతుంటారు. ఈ పార్టీల అధినేతలు కూడా అవే సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ నిర్వచనం మరింత బలపడింది. ఏపీ ఏర్పడినప్పటి నుంచి సదరు సామాజిక వర్గాలే పాలించాయి. బలమైన కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాలకు ఇప్పటికీ పాలించే అవకాశం రాలేదు. భవిష్యత్ లోనూ వస్తుందనే ఆశలు లేవు.

ఈ కులం కోణంలోనే బీజేపీ ఒకప్పుడు కాపులకు పెద్దపీట వేసింది. ఎందుకంటే రెడ్లు వైసీపీతో, కమ్మలు టీడీపీతో ఆల్రెడీ ఉన్నారు. ఏ పార్టీ సొంతం చేసుకోని కాపులను తాను అక్కున చేర్చుకోవాలని బీజేపీ భావించింది. అందుకే తెలంగాణలో బండి సంజయ్ ను, ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి వాళ్లను ఎంకరేజ్ చేసింది. కానీ ఏమైందో ఏమో సడెన్ గా బండి సంజయ్ ను, సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించింది. ఇక కాపుల పార్టీ అని చెప్పబడే జనసేన, టీడీపీతో కూటమి గట్టింది.

ఏపీలో ఈసారి అతి ఎక్కువగా జరుగుతున్నది కాపు సామాజిక వర్గం గురించే. ఎందుకంటే పవన్ కాపు సామాజిక వర్గం కాబట్టి..సీట్ల కేటాయింపులతో పాటు బలమైన సామాజికవర్గం కావడంతో వారి ఓట్లు రాబట్టుకోవాలని ఇటు కూటమి.. అటు అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఏకంగా కాపులకు 22 సీట్లు, తూర్పుకాపు, బలిజ తదితర కులాలకు 8, మొత్తం 30 సీట్లను కేటాయించింది. ఇక కూటమి పార్టీల్లో జనసేన 10, టీడీపీ 8 సీట్లను కేటాయించాయి. బీజేపీ జాబితా తాజాగా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి వైసీపీ, టీడీపీ కూటమికి కాపుల ఓట్లు ప్రధానం కాబోతున్నాయి. అందుకే అందరూ కాపుల ప్రాధాన్యమిస్తున్నారు. అయితే కాపు వర్గం ఓట్లు గంపగుత్తగా తమకే పడుతాయని భావిస్తున్న కూటమి పార్టీలు వారికి ఇచ్చిన సీట్లు చూస్తే వైసీపీ కన్నా తక్కువే. అయితే మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దానిలో ఏమైనా ఇస్తారా అనేది చూడాలి. అలాగే జనసేన, టీడీపీలు ఎలాగూ కాపులకు సీట్లు ఇచ్చాయి. తాను ఇవ్వకున్నా ఫర్వాలేదు అనుకుందో ఏమో బీజేపీ ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వలేదు.

బీజేపీ అభ్యర్థులు వీరే..

అనపర్తి : శివకృష్ణంరాజు
ఎచ్చర్ల : ఎన్. ఈశ్వరరావు
విశాఖ నార్త్ : పి.విష్ణుకుమార్ రాజు
ధర్మవరం : వై.సత్యకుమార్
విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
ఆదోని : పీవీ పార్థసారధి
అరకు వ్యాలీ : పాంగి రాజారావు
జమ్మలమడుగు : ఆదినారాయణ రెడ్డి
బద్వేలు : బొజ్జా రోషన్న

Exit mobile version