Asia Top Stars:ఆసియా టాప్ 50 జాబితాలో టాలీవుడ్ స్టార్లు ఎక్క‌డ‌?

Asia Top 50 Stars:నేడు టాలీవుడ్ స్టార్లు గ్లోబ‌ల్ రేంజుకు ఎదిగారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయ సినిమాకి గొప్ప గుర్తింపు ఉన్నా కానీ, గ‌డిచిన ఐదారేళ్లుగా టాలీవుడ్ ఖ్యాతి అసాధార‌ణంగా విస్త‌రించింది. బాహుబ‌లి-బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ గా గుర్తింపు సంపాదించాడు. కొమ‌రం భీముడుగా న‌టించిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పేరు మార్మోగింది.

అలాగే పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగింది. చైనా- జ‌పాన్-కొరియా- ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వంటి దేశాల్లోను మ‌న సినిమాలు రిలీజ‌వుతుంటే స్టార్ల‌కు ఆ మేర‌కు గుర్తింపు ద‌క్కుతోంది. కానీ ఎందుక‌నో ఇప్పుడు ఆసియా బెస్ట్ స్టార్ల జాబితాలో మ‌నోళ్లు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆసియా బెస్ట్ సెల‌బ్రిటీ లిస్ట్ లో క‌నీసం సౌత్ నుంచి ఒక్క పేరు కూడా లేదు. ఈ ఏడాది ర‌జ‌నీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ పేర్లు మార్మోగాయి.

కానీ వాళ్ల‌కు చోటు లేదు. UK కి చెందిన ప్ర‌ముఖ‌ వారపత్రిక ఈస్టర్న్ ఐ ప్రచురించిన జాబితాలో మ‌న సౌత్ స్టార్ల పేర్లు ఏవీ క‌నిపించ‌లేదు. టాప్ 50 ఆసియా బెస్ట్ స్టార్ల జాబితాలో పూర్తిగా ఉత్త‌రాది స్టార్లు మాత్ర‌మే చోటు ద‌క్కించుకున్నారు. బాద్ షా షారూఖ్ నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సంపాదించ‌గా, అలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిల‌వ‌గా, ర‌ణ‌బీర్ క‌పూర్ ఆరోస్థానంలో నిలిచాడు. ప్ర‌ముఖ గాయ‌కుడు న‌టుడు దిల్జిత్ దోసాంజ్.. రణబీర్ కపూర్ కంటే ముందు స్థానం(నాలుగు)లో ఉన్నాడు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్టార్ల‌కు ఉన్న గుర్తింపు, ఆద‌ర‌ణ, పాపులారిటీ వంటి చాలా విష‌యాలు ఈ జాబితాను ప్ర‌భావితం చేస్తాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న గుర్తింపు, అలాగే కొంద‌రు స్టార్లు సామాజిక సేవ‌లతో, ఫ్యాష‌న్ రంగంలో రాణింపు వంటి అంశాల‌తోను ఈ జాబితాలో చోటు ద‌క్కించుకుంటున్నారు. అలాగే ప్ర‌జ‌లు నేరుగా ఫ‌లానా స్టార్ అంటూ నామినేట్ చేసే ప్ర‌క్రియ కావ‌డంతో ఈ స‌ర్వేకు యేటేటా ఎంతో గుర్తింపు ఉంది. దిల్జీత్ దోసాంజ్ అంత‌ర్జాతీయ లైవ్ ఈవెంట్ల‌తో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అందుకే ఈ జాబితాలో చోటు ద‌క్కింది.

TAGS