Gil and Iyer : ప్చ్..లాభం లేదు.. మార్చాల్సిందే.. విమర్శకుల నోళ్లు మూయించని గిల్, అయ్యర్!

Gil and Iyer

Gil and Iyer

Gil and Iyer : టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. 140 కోట్ల జనాభాలో ఆ అవకాశం దక్కేది 11మందికి మాత్రమే. ఈ 11మందే క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడమంటే పెద్ద అఛీవ్ మెంట్. కానీ ఈ అవకాశాలను కొందరు ప్రముఖ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చాన్స్ లు ఇచ్చిన తమ ఆట తమదే అన్నట్టుగా వ్యవహరిస్తే ఇక వారిని ఏమనాలి?

సీనియర్ల స్థానంలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఇద్దరు బ్యాటర్లు పదే పదే తమ తప్పులను రిపీట్ చేస్తున్నారు. వీరెవరో మీకిప్పటికే అర్థం అయ్యుంటుంది. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్. ఓ వైపు వీళ్ల స్థానాల్లో రావడానికి యువ ఆటగాళ్ల రెడీగా ఉన్నా.. వీరిలో ఏమాత్రం భయంలేదు. వీరి ఆటతీరు మార్చుకోవడం లేదు.

ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె జట్టులో ఉండడంతో మొన్నటివరకూ శ్రేయస్ అయ్యర్ కు చాన్స్ రాలేదు. ఒకవేళ వచ్చినా ఒకట్రెండు మ్యాచ్ లే. ఆ సీనియర్లు ఫామ్ కోల్పోవడంతో గిల్, అయ్యర్ లను సెలెక్టర్లు ఎంపికచేశారు. మిడిల్ ఆర్డర్ లో జట్టుకు ప్రయోజనం చేకూరుస్తారని భావిస్తే తరచూ విఫలం అవుతున్నారు.

ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో శ్రేయస్ అయ్యర్ 35,13 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. గత 11 ఇన్నింగ్స్ లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ధాటిగా ప్రారంభిస్తున్నా.. ఆటను నిలుపుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో అతి ప్రధానమైన ఓపిక అతడికి ఉండడం లేదని, అందుకే వికెట్ పారేసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడో స్థానంలోకి వస్తే.. నేనేంటో చూపిస్తా..అంటూ ఓపెనర్ ప్లేస్ ను వదిలి వన్ డౌన్ లోకి వచ్చాడు గిల్. అలా కిందికొచ్చిన గిల్ ఆట మరింత కిందికి వెళ్లిపోవడం ఆందోళనకరం. గత ఐదు టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 36. తాజా వైజాగ్ టెస్టులో అతడి స్కోరు 34. మొదట జోరు మీద కనిపించినా కొద్దిసేపట్లోనే పెవిలియన్ చేరిపోయాడు.

ఇక గిల్, శ్రేయస్ తమ ఆట తీరు మార్చుకోకపోతే సెలెక్టర్ వీరిని వచ్చే మూడు టెస్టులకు ఉంచుతారా? లేదా అనేది అనుమానమే. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోకపోతే సెలెక్టర్లు మాత్రం ఏం చేస్తారు.

TAGS