Minister Angani : మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో ఎవరినీ వదిలిపెట్టం: మంత్రి అనగాని
Minister Angani : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైళ్ల దహనం కేసు మంగళవారం శాసనమండలిని కుదిపేసింది. ఫైళ్ల దహనం వెనుక వైసీపీ పెద్దలు ఎవరున్నారనే విషయంలో శాసనమండలిలో టీడీపీ సభ్యలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేరును ప్రస్తావించగా, విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో సభలో ఇరు పార్టీల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది.
కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మాజీ మంత్రి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారని బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు మంత్రి అనగాని కౌంటర్ ఇస్తూ, సీఐడీ దర్యాప్తులో తేలిన అంశాలను తాను సభ దృష్టికి తీసుకొచ్చానని, కేసు విషయంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.