JAISW News Telugu

Viral Video : జగన్ అరాచక పాలనపై ఇంత బాగా ఎవరూ చెప్పి ఉండరు..

Viral Video

Andhra Sugars Chairman Viral Video

Viral Video : ఏపీ ఎన్నికలు కూటమి దూసుకుపోతుంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరో పక్క జనసేనాని పవన్ కల్యాణ్ తమ ప్రచారంతో వైసీపీ అధినేత జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గేమ్ ఛేంజర్ గా మారబోతోంది. ఇప్పటికే దీని వల్ల జరిగే నష్టాలను టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే కాకుండా ప్రధాన మీడియా, లాయర్లు, మేధావులు, విశ్లేషకులు ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు.

తాజాగా ఆంధ్రా షుగర్స్ చైర్మన్ సైతం తన ఫ్యాక్టరీలో కార్మికులను, సిబ్బందిని ఉద్దేశించి రాష్ట్ర భవిష్యత్, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అద్భుత రీతిలో అవగాహన కల్పించారు. ఆయన మాటలు విన్నవారు ఎవరూ కూడా జగన్ కు ఓటు వేయరు.  జగన్ అరాచక పాలన గురించి ప్రతీ ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన స్పీచ్ రాష్ట్రంలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే..

‘‘ జగన్ గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎందుకంటే పబ్లిక్ స్కూల్ లో నాకు ఆయన 8 సంవత్సరాల జూనియర్. స్కూల్ చరిత్రలోనే ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్న ఏకైక స్టూడెంట్ జగన్. అతడికి మూడు సార్లు టీసీ ఇస్తే ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి వారిని బతిమాలి మరి స్కూల్లో చేర్పించేవారు. చివరకు పదో తరగతి పరీక్షలు ప్రైవేట్ గా రాయించారు. ఇలాంటి వ్యక్తి ఎలా తయారవుతాడో మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో గెలవడానికి ఇల్లు అమ్ముకున్నాడు. కానీ వైఎస్ కుటుంబం ఐదేళ్లలోనే ఎన్ని వేల కోట్లు సంపాదించారో మనం చూస్తూనే ఉన్నాం. ఏదో కష్టపడి సంపాదించుకున్నది కాదు.. అంతా అవినీతి, కమీషన్లతోనే..’’అని చెప్పుకొచ్చారు.

అలాగే గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ ఏపీకి రాలేదన్నారు. అమర్ రాజా లాంటి పెద్ద పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలివెళ్లాయి. ఎన్టీఆర్, చంద్రబాబు లాంటి వాళ్లు రాష్ట్ర బాగు కోసం పునాదులు వేసుకుంటూ వస్తే జగన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ ను పతనావస్థకు తీసుకెళ్తున్నారు. జగన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో పేదల భూములు ప్రభుత్వం చేతిలోకి వెళ్తాయన్నారు. ఏదైనా వివాదం వస్తే నామినేట్ చేయబడిన ఆఫీసర్ దగ్గరకు వెళ్లాలన్నారు. మన ఆస్తులను పెట్టి మనం పిల్లల చదువు కోసమో, మన సమస్యలను పరిష్కరించుకోవడానికో  లోన్ తీసుకోలేం. లోన్ తీసుకోవాలంటే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రజలు ఆలోచించుకోవాలని చాలా అద్భుతంగా వివరించారు.

Exit mobile version