Elon Musk : అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు: ఎలాన్ మస్క్

Elon Musk

Elon Musk

Elon Musk : పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వినియోగంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్కు గురవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ ను నివారించ వచ్చని వ్యాఖ్యానించారు.

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ తాజాగా ఆ వ్యవహారంపై స్పందిస్తూ యూఎస్ ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించాలని అన్నారు. వీటిని వ్యక్తులు లేదా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే దేశానికి నష్టాన్ని కలిగిస్తుందని ఎలాన్ మస్క్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.కాగా, ప్యూరో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు.

TAGS