OTT : నెట్ ఫ్లిక్స్ ఇండియాలో పాపులర్ అవుతున్న రోజుల్లో చాలా కాలంగా యాడ్స్ లేకుండా ఎలంటి అంతరాయం కలుగకుండా వెబ్ సిరీస్, షోలు, సినిమాలు ప్లే చేసేందుకు డబ్బులు వసూలు చేసింది. కానీ 2022 చివరిలో వారు ఆ పద్ధతికి స్వస్తి చెప్పారు. భయటి నుంచి యాడ్స్ తీసుకుంటే యూజర్లపై ప్రెషర్ ను తగ్గించవచ్చని అనుకున్నారు. ఆ విధంగానే చవకైన ప్లాన్లను తీసుకువచ్చారు.
నెట్ ఫ్లిక్స్ బాటలోనే అమేజాన్ ప్రైమ్ వీడియో కూడా వెళ్లింది. ఈ పద్ధతితో ఈ రెండు ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇండియాతో తమ చందాదారులను మెల్ల మెల్లగా పెంచుకుంటూ వెళ్లాయి. అయితే కొన్ని ప్లాట్ ఫామ్స్ లా కాకుండా మూవీ, సిరీస్ మధ్యలో ఇష్టం వచ్చినట్లు కాకుండా.. ఒక పద్ధతిలో మాత్రమే యాడ్స్ ప్లే చేస్తున్నాయి. దీంతో ఇవి భారీగా ఆర్జించగలుగుతున్నాయి.
తమకు కూడా మంచి లాభాలు వస్తున్నాయని ప్రకటనలు ఇచ్చేవారు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఈ రెండు ఓటీటీ ప్లా్ట్ ఫామ్స్ ఇంటర్నేషనల్ కాబట్టి ఇందులో యాడ్స్ వస్తే బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని అందరూ భావిస్తారు. అయితే, 2020లో యాడ్స్ ద్వారా ఈ ప్లాట్ ఫామ్స్ 26.2 బిలియన్ డాలర్లు సంపాదంచగా.. ఈ ఏడాది 63 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
యూ ట్యూబ్ తో పోలిస్తే దాని కంటే కూడా ఎక్కువగానే సంపాదిస్తుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లకు ఆ పైసా కావాలి. వృద్ధిని కొనసాగించేందుకు రెండు కంపెనీలు యూఎస్ వెలుపల కొత్త కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. యూరప్, ఇండియా వంటి దేశాల్లో ఎక్కువ షోలు, సినిమాలు తీసి తమ సేవలకు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి.
ఒకప్పుడు సబ్స్క్రిప్షన్ల కోసం డబ్బులు చెల్లించేలా చేయడంపై దృష్టి సారించినప్పటికీ.. ఇప్పుడు దాని కంటే యాడ్స్ రూపంలో ఎక్కువ డబ్బును వెనకేసుకోవాలని, దీనికి సమానంగా చందాదారులను కూడా పెంచుకుంటూ వెళ్లాలని అనుకుంటుంది. మొత్తం మీద, ప్రకటనలపై డబ్బు సంపాదించడంతో పాటు మంచి కంటెంట్ తో చందాదారులను పెంచుకోవడం మధ్య సమతుల్యతను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.