Director : టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అన్న రీమేక్ చేస్తే మేకు దించినట్లే అంటూ సైటైర్లు వేస్తున్నారు. రాడ్ కే రాడ్ దించగల దిట్ట అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. హరీష్ శంకర్ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గత వారం విడుదల కాగా, దారుణంగ ట్రోల్ అవుతున్నది. సినిమా ఫలితం అటుంచితే ఇందులోని డైలాగులు, హీరోయిన్ తో హీరో రోమాన్స్, డ్యాన్సులు ఇవన్నీ ట్రోలర్లు, మీమర్లకు పని కల్పించినట్లయ్యింది.
ఎన్నో అంచనాల మధ్య హరీష్ శంకర్, రవితేజ కలయికలో తెరకెక్కిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఎప్పుడో ఐదేళ్ల క్రితం చేసిన రెయిడ్ సినిమాను రవితేజతో రీమేక్ చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమా తీరుపై ప్రేక్షకులు మండి పడుతుున్నారు. చివరకు రవితేజ అభిమానులు నొసలు చిట్లిస్తున్నారు. హరీష్ శంకర్ మరీ ఇంత దారుణంగా సినిమా చేస్తాడని అస్సలు ఊహించలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేను చూపించిన విధానం, ఆమెపై షూట్ చేసిన కొన్ని సీన్లు, పాటల్లో వేయించిన స్టెప్పులు,.. బూతు డైలాగులను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు. తనను కావాలనే ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రవితేజ రామా రావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ఖిలాడీ, ఈగల్ చిత్రాలు కూడ అంతగా ఆడలేదని, కానీ తన సినిమానే ఇంతగా ట్రోల్ చేయడంలోనే విషయం ఏంటో అర్థమవుతుందని అంటున్నాడు.
అయితే తాను ఈ చిత్రంలో రాసిన మంచి డైలాగులకు ఎంతో మంది అభినందిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కట్నం తీసుకుంటే వ్యభిచారం చేసినట్లేనని తాను రాసిన డైలాగ్ అందరికీ మెచ్చుకుంటున్నారని, కానీ ఇలాంటి మంచి వాటి గురించి ట్రోలర్లు స్పందించరని హరీష్ శంకర్ మండిపడ్డారు.
ఇక రామ్‌తో కచ్చితంగా సినిమా చేస్తానని, త్వరలోనే అది ప్రకటిస్తామని వెల్లడించాడు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ లాంటి మంచి ప్రొడ్యూసర్‌ను ఇది వరకు తానెప్పడూ చూడలేదని, సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా బ్యాలెన్స్ రెమ్యూనరేషన్స్ చెల్లించేశారని చెప్పుకొచ్చాడు. అలాంటి నిర్మాత దొరకడం చాలా అరుదంటూ కితాబిచ్చాడు. రవితేజ, పీపుల్స్ మీడియా కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ వెల్లడించాడు.