Minister Nara Lokesh : ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh
Minister Nara Lokesh : ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ నిధులు ఇస్తామని ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం నిధులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉంటామన్నారు. బడికి వెళుతున్న పిల్లలందరికీ నిబంధనల ప్రకారం ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్న భేదం లేకుండా విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు.
గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగామని, గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి అమలుచేస్తున్న c