JAISW News Telugu

No life ban : దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు..ఆరేండ్లు చాలు: కేంద్రం

No life ban : వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇది చాలా కఠినమైనదని, ప్రస్తుతం ఉన్న ఆరేండ్ల అనర్హత సరిపోతుందని పేర్కొన్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.

దోషులుగా తేలిన పొలిటికల్ లీడర్స్పై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్న ఆరేండ్ల నిషేధం సరిపోదని, వీరు ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై ఫిబ్రవరి 10న కోర్టు విచారణ చేపట్టింది.

సెక్షన్‌ 8, సెక్షన్‌ 9 రాజ్యాంగ చెల్లుబాటుపై స్పందన తెలియజేయాలని కేంద్రంతోపాటు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధాన్ని వ్యతిరేకించింది.

Exit mobile version