Tirumala : తిరుమలలో ₹300 టికెట్లు తీసుకున్నా దర్శనం లేదా?

Tirumala : తిరుమలలో ప్రస్తుతం రోజుకు 15 వేల ₹300 టికెట్లను ఆన్‌లైన్‌లో మూడు నెలల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఉదయం 9:30 గంటలకు వీరికి మొదటి దర్శన సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, శనివారం నుండి బుధవారం వరకు వీఐపీ బ్రేక్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కావడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణ బ్రేక్, నైవేద్య విరామం, ప్రోటోకాల్ బ్రేక్, శ్రీవాణి దర్శనం, దాతలు మరియు రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగడంతో, ఉదయం 9:30 స్లాట్ పొందిన భక్తులు దర్శనానికి ఐదు నుండి ఆరు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

TAGS