Posani Krishna Murali : పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఇక మీదట నుంచి తాన రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణ తెచ్చాడని కేసీఆర్ కు ఓటేసా, కేసీఆర్ ను విమర్శించినా కానీ ఏనాడు నా మీద కేసులు పెట్టలేదని పోసాని కృష్ణమురళి అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైసీపీ నేతగా ఉన్న పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీలో పలు పోలీస్ స్టేషన్ లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రకటన చేయడం గమనార్హం.