Trump : 256 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కూడా ట్రంప్ అన్న మాట చెప్పే దమ్ము లేదు
Trump Says : అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ మరో సారి వైట్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. మొదట్లో ఎన్ని విమర్శలు వచ్చినా ఆఖరుకు ఎన్నికల్లో ఆయన విజయదుంధుబీ ఖాయం అయిపోయింది. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘హిందూ’ కార్డు బయటకు తీశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే భారత్, అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. అమెరికాలోని హిందువులు ఏర్పాటు చేసిన సెమీ దీపావళి వేడుకలకు ట్రంప్ ను ఆహ్వానించారు. ఈ మేరకు హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు తెలుసు నేను భారత దేశానికి పెద్ద అభిమానిని. నాకు భారత దేశం అన్నా, భారతీయులన్నా ముఖ్యంగా హిందువులంటే ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. భారతదేశానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు అత్యంత ప్రియమైన మిత్రుడు. నాకు బాగా కావాల్సిన వ్యక్తి కూడా. ప్రస్తుతం భారత్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాటిని ఎదుర్కోవడానికి నా స్నేహితుడు నరేంద్రమోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేను అమెరికా అధ్యక్షుడిని అయితే భారత్ కష్టాలన్నీ తొలగిస్తానని ట్రంప్ చెప్పారు. 256 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్ష అభ్యర్థి కూడా ఇలా ట్రంప్ లా హమీ ఇవ్వలేదనే చెప్పాలి.