Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం వెలువరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే గడువు ఉంది. పార్టీలు వారి అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచార యాత్ర ప్రారంభించగా.. ప్రభుత్వ పక్షంలో ఉన్న వైఎస్ జగన్ సిద్ధం పేరుతో సభలు సమావేశాలు పెడుతూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు.
రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ముందుకెళ్తుంది. ఈసమయంలో జనసేన అధినేత మాట్లాడిన విషయాలు ఏపీ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు లేవని ఆయన కుండ బద్దలు కొట్టారు. దీంతో ఒక్కసారిగా ఏపీ ప్రజలు గందరగోళంలో పడ్డారు.
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న రోజుల్లో ఆయనను పరామర్శించేందుకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ములాఖత్ నిర్వహించారు. ఈ ములాఖత్ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసి పోరాడుతామని, ఒంటరిగా పోరాడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి వైసీపీకి మేలు జరుగుతుందన్న ఆయన కలిసి నడుస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ+జనసేన కలిసే పోటీ చేస్తారని రాష్ట్రం మొత్తం అనుకుంది.
కానీ, ఈ రోజు (ఫిబ్రవరి 04) తిరుపతి టూర్ లో ఆయన పొత్తులేదని జనసేన ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తిరుపతిలో ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించారు పవన్ కళ్యాణ్. తమను గౌరవించని పార్టీలో కొనసాగేది లేదని చెప్తున్నారు. గతంలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ ఉంటే రాష్ట్రంలో థర్డ్ ఫ్రెంట్ ఉండేదని, కానీ ఇప్పుడు అది కూడా లేని వాపోయారు. ఈ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
పొత్తులు లేవు – పవన్ సంచలన ప్రకటన pic.twitter.com/ngYooMsafu
— AP360 (@andhraa360) February 3, 2024