Kalki 2898 AD : రికార్డ్ ధరకు ‘కల్కి 2898 ఏడీ’ నైజాం హక్కులు..
Kalki 2898 AD : ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ విడుదలకు సిద్ధంగా ఉండడంతో కల్కి నిర్మాతలు వివిధ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో అగ్రిమెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆ దిశగా నిజాం ఏరియాకు సంబంధించి రైట్స్ అమ్ముడు పోయాయని తెలుస్తోంది.
నైజాంను రూ. 65 కోట్లకు సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్
కల్కి సినిమాకు సంబంధించి నైజాం ఏరియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏషియన్ సినిమాస్ అనుబంధ సంస్థ ‘గ్లోబల్ సినిమాస్’ సొంతం చేసుకుంది. దాదాపు 65 కోట్లకు ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బహుశా ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ డీల్స్ లో ఒకటి – నిజానికి ప్రభాస్ సినిమాకు ఇది రికార్డ్. ‘సలార్’ సూపర్ సక్సెస్ తర్వాత కల్కి సినిమా వస్తుండడంతో ట్రేడ్ పండితులు కూడా ప్రభాస్ కు ఉన్న భారీ మార్కెట్, అతని గత చిత్రాలకు జరిగిన బిజినెస్ ను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కొనుగోలు చేశారు. ఇంకా చాలా ఏరియాల్లో కల్కి బిజినెస్ క్లోజ్ అయింది కానీ కొన్ని కాంట్రాక్ట్ బాధ్యతల కారణంగా నిర్మాతలు అనౌన్స్ చేయడం లేదు. త్వరలోనే ఆంధ్రా రీజియన్ లో బిజినెస్ డీల్స్ రివీల్ కానున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కల్కి హిందీ హక్కులు
హిందీలో కల్కిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బాలీవుడ్ నిర్మాత అనిల్ తడానీ కల్కి నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం రూ.100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ ఇండియా జనాలకు రీచ్ అయ్యేలా నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ తన సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు సమాచారం. జూన్ 27న మెజారిటీ స్క్రీన్లు/ థియేటర్లను బ్లాక్ చేయడానికి అనిల్ తడానీ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.