Nitin : ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ తండ్రి అండతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో హీరోగా ఎదిగాడు. తొలి చిత్రం జయం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండో సినిమా దిల్ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత హిట్టు ప్లాఫులతో సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ మధ్యలో పెద్ద డైరెక్టర్ల, పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసినా ఒక్కటీ ఆడలేదు. వరుసగా ప్లాఫులు రావడంతో కెరీర్ డైలమాలో పడింది.
స్టోరీల ఎంపికలో తన రూటు మార్చుకొని తనకు సెట్ అయ్యే సినిమాలను ఎంచుకున్నాడు. అలా తమ సొంత ప్రొడక్షన్ లో గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చేసి సక్సెస్ బాట పట్టాడు. మళ్లీ వరుస సినిమాలో తన జోరు పెంచాడు. తను చేసిన సినిమాలు కొన్ని ఆర్థికంగా దెబ్బతీసినా మళ్లీ నిలదొక్కుకున్నాడు నితిన్. కానీ మరో హీరో తో సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం తీసిన ఆ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు.
అప్పుల్లో ముంచేసిన అక్కినేని హీరో..
కింగ్ నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేసింది నితిన్ కావడం గమనార్హం. అఖిల్ అక్కినేని అఖిల్ అక్కినేని ఫస్ట్ సినిమాకు ప్రొడ్యూసర్ నితినే. తొమ్మిదేళ్ల క్రితం ఈ సినిమా కోసం దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో ఈ రేంజ్ ఎంట్రీ ఏ హీరోలకు దక్కలేదు.
వీవీ వినాయక్ దర్శకత్వంలో
ప్రముఖ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేనిని హీరోగా లాంచ్ చేస్తూ తీసిన సినిమా అఖిల్. స్టైలిష్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు వీవీ వినాయక్. మంచి కాంబినేషన్ కావడంతో నితిన్ ఖర్చుకు వెనకాడకుండా భారీగా సినిమాను తీశాడు. డెబ్యూ హీరోలతో బంపర్ హిట్లు కొట్టిన ఘనత వి.వి వినాయక్ కు ఉంది. ఇక అక్కినేని వారసుడితో సినిమా అనగానే వచ్చిన హైప్ అంతా కాదు. పాటలు, ఫైట్లు,లోకేషన్లు, విజువల్స్ ప్రతీది వావ్ అనిపించింది. కానీ సినిమా రిలీజ్ మొదటి షో పడ్డాకే తెలిసింది.. ఆ సినిమా దమ్మేంటో. ఒక్క షో తోనే సినిమా భవితవ్యం తేలిపోయింది. వారం రోజులు కూడా సినిమా థియేటర్లలో నిలబడలేకపోయింది. ఇక కొన్ని ఏరియాల్లో అయితే మూడో షో నుంచే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఓ స్టార్ హీరో కొడుకు డెబ్యూ మూవీ, అందులో మాస్ డైరెక్టర్, స్టార్ హీరో ప్రొడ్యూసర్ ఈవేమీ సినిమాను నిలబెట్టలేకపోయాయి . కనీసం ఖర్చు చేసిన బడ్జెట్ లో కనీసం పాతిక శాతం కూడా రాబట్టలేకపోయింది. దాదాపు ఐదారేళ్లు ప్లాఫులు ఎదుర్కొన్న నితిన్ కు ఈ స్థాయిలో నష్టాలు రాలేదు. కానీ ఒక్క అక్కినేని నట వారసుడితో చేసిన సినిమా కోలుకోలేని దెబ్బతీసింది.
ఇక అఖిల్ ను ఒక్క సినిమా కూడా కాపాడలేకపోయింది. ఇప్పటి దాకా సక్సెస్ ఎరుగని హీరోగా ముద్రపడిపోయాడు. ఎంత ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ప్రస్తుతం ఒక్కరూ కూడా అఖిల్ వైపు చూసిన వాళ్లు లేరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుమంత్, సుశాంత్ కొద్దో గొప్పో హీరోలమని అని అనిపించుకున్నా అఖిల్ మాత్రం అసలు హీరోయేనా పరిస్థితి దాపురించింది. అఖిల్ పరిస్థితి ఎలా ఉన్నా నితిన్ కు మాత్రం ఇప్పటికీ కలలో ఆ చిత్రమే కనిపిస్తున్నదట.
వచ్చాడు. రిలీజ్కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ప్రస్తుతం అఖిల్ ఓ సాలిడ్ కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.