NITI Aayog : రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం

NITI Aayog
NITI Aayog : ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో ఈరోజు (శనివారం) నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సభ్యులు పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047 అజెండాగా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవలసిన చర్యలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.