Nirudyoga Bruthi : నిరుద్యోగ భృతి.. వివరాలు
Nirudyoga Bruthi : ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఈ పథకం 2018లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కూడా అదే పేరుతో ఈ స్కీం కొనసాగే అవకాశముంది. ఈ పథకానికి డిప్లమో కాని, డిగ్రీ కాని, పోస్టు గ్రాడ్యుయేషన్ కాని చేసిన వారు అర్హులు. వయస్సు 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. నిరుద్యోగ భృతి పథకంలో నెలకు రూ. 3000 అందజేస్తారు.
మీరు ఎంప్లాయి అయి ఉండకూడదు. ఏదైనా చిరుద్యోగం చేసేవారు, పీఎఫ్ అకౌంట్ లేనివారు అర్హులే. తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. భూమి కూడా 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. ఫోర్ (4) వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు అంటే మీ రేషన్ కార్డులో ఆ పేరు ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఒకవేళ రుణాలు తీసుకున్న అది రూ.5 లక్షల లోపు ఉండాలి. స్కాలర్ షిప్ తీసుకుంటూ ఉండకూడదు. అలాగే చదువుతున్నవారు, పెన్షన్ పొందుతూ ఉన్న దరఖాస్తుకు అర్హులు కారు.
దీనికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దానికి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా, విద్యార్హతల సర్టిఫికేట్స్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉండాలి. దీనికి అప్లై చేయడానికి వెబ్ సైట్ లేదా యాప్ క్రియేట్ చేసే అవకాశముంది.