Minister Nimmala Ramanaidu : కాళ్లు కడిగి పెన్షన్లు అందించిన మంత్రి నిమ్మల రామానాయుడు

Minister Nimmala Ramanaidu
Minister Nimmala Ramanaidu : ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడవిపాలెం గ్రామంలో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి కాళ్లు కడిగి పెన్షన్లు అందించారు. అడవిపాలెంలో ఉదయం 6 గంటలకు పల్లెంలో ఓ దివ్యాంగుడి కాళ్లు కడిగి పెన్షన్ అందజేశారు. మంత్రి దివ్యాంగుల కాళ్లు కడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, సీఎం చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు ఒకే విడతలో అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రతి నెలా పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.