NTR Devara : ‘దేవర’ కి బిజినెస్ ఆఫర్స్ నిల్..పాపం ఎన్టీఆర్ కి ఇలాంటి పరిస్థితి ఏంటి!
NTR Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవర’ కి టాలీవుడ్ లో ఏ రేంజ్ హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇక నుండి ఆయన సినిమాల కోసం ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఎదురు చూస్తారు కాబట్టి, ఒక మామూలు సబ్జెక్టు ని పాన్ వరల్డ్ సబ్జెక్టు గా మలిచాడు డైరెక్టర్ కొరటాల శివ.
అలా ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యడానికి దాదాపుగా ఏడాది సమయం పట్టింది. ఏడాది పాటు స్క్రిప్ట్ లో మార్పులు చేసి సెట్స్ మీదకి వచ్చిన ‘దేవర’ చిత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకి దూసుకుపోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ గ్లిమ్స్ తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్లు కనీవినీ ఎరుగని రేంజ్ లో వస్తాయని అనుకున్నారు ఫ్యాన్స్.
కానీ బయ్యర్స్ మాత్రం రీసెంట్ గా విడుదలైన ‘సలార్’,’గుంటూరు కారం’ సినిమాలు అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాబట్టలేకపోవడం తో నిర్మాతలు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి ‘దేవర’ బయ్యర్స్ సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది. నిర్మాతలు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించారు. ఆ రేంజ్ లోనే బయ్యర్స్ కి కూడా బిజినెస్ ఆఫర్స్ ని క్వాట్ చేసారు. కానీ బయ్యర్స్ అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఉదాహరణకి ఓవర్సీస్ లో ఈ సినిమాకి 40 కోట్ల రూపాయిలను నిర్మాతలు అడగగా, బయ్యర్స్ 20 కోట్ల రూపాయలకు మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. అలాగే నైజాం ప్రాంతం హక్కుల కోసం నిర్మాతలు 50 కోట్ల రూపాయిలను డిమాండ్ చేస్తే బయ్యర్స్ 35 కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు.
ఒక్క సీడెడ్ ప్రాంతం లో మాత్రమే ఈ సినిమాకి పాతిక కోట్ల రూపాయిల ఫ్యాన్సీ ఆఫర్ కి బయ్యర్స్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఎన్టీఆర్ కి మొదటి నుండి బలమైన ప్రాంతం అనే విషయం తెలిసిందే. అందుకే ఆ రేంజ్ లో అక్కడ బిజినెస్ జరిగింది. ఇక కోస్తాంధ్ర లో అయితే ఈ సినిమాకి 40 నుండి 45 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరుగుతుందట, ఒకవేళ సినిమా అనుకున్న తేదీ కి కాకుండా వేరే డేట్ కి వస్తే మాత్రం ఈ బిజినెస్ ఆఫర్స్ మరింత తగ్గిపోయే అవకాశం ఉందట.