Nikhil Couple Good News : తండ్రి కాబోతున్న నిఖిల్ జంట.. పెళ్లి తర్వాత నాలుగేళ్లకు గుడ్ న్యూస్!
Nikhil Couple Good News : టాలీవుడ్ లో యంగ్ బ్యాచ్ మొత్తం ఒక ఇంటి వారు అవుతున్నారు. మరి ఈ యంగ్ బ్యాచ్ లో ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టిన హీరోలు ఒక్కొక్కరిగా తండ్రి అవుతున్నాము అంటూ గుడ్ న్యూస్ చెప్పి అందరికి సర్ప్రైజ్ ఇస్తున్నారు.. ఇక తాజాగా మరో యంగ్ హీరో తండ్రి అవ్వబోతున్నారు అనే గుడ్ న్యూస్ నెట్టింట వైరల్ అయ్యింది..
ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. నిఖిల్ సిద్ధార్థ.. ఈయన ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.. కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ మార్కెట్ విస్తరించింది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఈయన మార్కెట్ పెరగడంతో నిఖిల్ లైనప్ లో క్రేజీ అండ్ భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి..
ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేతిలో ఉండగా ఒకటి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఆ సినిమానే ”స్వయంభు”.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ కృష్ణమాచార్య తెరకెక్కిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది..
మరి ఈ సినిమాతో బిజీగా ఉన్న నిఖిల్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.. నిఖిల్ గత నాలుగేళ్ళ తర్వాత పల్లవి అనే డాక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందా అని అంత ఎదురు చూస్తుండగా ఆ తరుణం వచ్చినట్టే అనిపిస్తుంది.. తాజాగా నిఖిల్ భార్య పల్లవి బేబీ బంప్ తో కనిపించినట్టు తెలుస్తుంది..
ఫ్యామిలీ ఫంక్షన్ లో ఈ జంట పాల్గొనగా బేబీ బంప్ తో రావడంతో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది.. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ ఈ ఫోటోను నెట్టింట షేర్ చేసి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నాలుగేళ్ళ తర్వాత నిఖిల్-పల్లవి నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అయతే అఫిషియల్ గా ఎప్పుడు చెబుతారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..