Niharika Love Letter : ప్రేమ లేఖ అంటూ నిహారిక వీడియో షేర్.. వారిని పరిచయం చేస్తూ.. 

Niharika Love Letter

Niharika Love Letter

Niharika Love Letter : మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈమె మెగా డాటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.. ముందుగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

హీరోయిన్ గా మూడు సినిమాల్లో మాత్రమే చేసింది.. కానీ ఇవి పెద్దగా సక్సెస్ కాలేక పోవడంతో ఈ భామకు మెగా బ్రదర్ నాగబాబు పెళ్లి చేసి ఒక ఇంటికి కోడలుగా చేసాడు. కానీ ఇది మూడునాళ్ళ ముచ్చటగా ముగిసింది. నిహారికకు 2020లో పెద్దలు కుదిర్చిన పెళ్లిని ఘనంగా జరిపించారు.. వెంకట చైతన్య తో విభేదాల కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు.

పెళ్లి అయిన మూడేళ్లకే విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు.. ఇక విడాకుల తర్వాత వీరిద్దరూ ఇప్పుడు కెరీర్ పై వారు ద్రుష్టి పెట్టారు.. సినిమాలకు దూరంగా ఉండమని అత్తింటి వారు కండిషన్ పెట్టడం వల్లనే నిహారిక చైతన్యతో విడిపోయినట్టు టాక్. విడాకుల తర్వాత నిహారిక ముందు కంటే ఎక్కువుగా యాక్టివ్ గా ఉంటూ కెరీర్ పై ద్రుష్టి పెట్టింది..

ఒక వైపు తనకు నచ్చిన సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా మారిపోయి చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తుంది. ఇది పక్కన పెడితే తాజాగా నిహారిక లవ్ లెటర్ పేరుతో ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇది వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో నిహారికతో పాటు తల్లి, వదిన లావణ్య త్రిపాఠీ, శ్రీజ, సుస్మిత ఉన్నారు. వీరంతా తన కష్టసుఖాల్లో మద్దతుగా నిలిచారని వారి పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

TAGS