Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదకు షిఫ్ట్ చేసింది. మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె సక్సెస్ లు రాకపోవడం తో నటనకి దూరమై ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి పలు వెబ్ సిరీస్లు, సినిమాలను నిర్మించింది. కానీ అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో కొంతకాలం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇప్పటికే తెలుగు లో ఒక సినిమా షూటింగ్ ని గత ఏడాది మొదలు పెట్టింది. ఇప్పుడు మలయాళం లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా మలయాళం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన RDX అనే చిత్రం లో హీరో గా నటించిన షేన్ నిగమ్ హీరోగా మద్రాస్ కారన్ అనే సినిమా మోడలింది. ఈ చిత్రం లో నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది మూవీ టీం.
ఈ సినిమాతో నిహారిక భారీ హిట్ ని అందుకుంటుంది అనే గట్టి నమ్మకం తో ఉన్నది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని జరుపుకుంది. నిహారిక ఉంది కాబట్టి ఈ సినిమాని తెలుగులో కూడా దబ్ చేసి విడుదల చేసేందుకు చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే నిహారిక తన భర్త చైతన్య తో విడాకులు తీసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.విడాకులు తీసుకున్న తర్వాత ఈమె రెండవ పెళ్లి ఎవరిని చేసుకోబోతుంది అని మాట్లాడుకున్నారు. కానీ ఆమె ఎవ్వరూ ఊహించని విధంగా కెరీర్ మీద ఫోకస్ పెట్టడం గమనార్హం. నాకేమి వయస్సు అయిపోలేదని, కేవలం 30 ఏళ్ళు మాత్రమేనని, కచ్చితంగా రెండవ పెళ్లి చేసుకుంటాను కానీ, దానికి చాలా సమయం ఉంది అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.
అంతే కాకుండా భర్త చైతన్య తో విడాకులు గురించి మాట్లాడుతూ ‘ఎవరినీ అంత తేలికగా, గుడ్డిగా నమ్మకూడదు అని ఈ వైవాహిక జీవితం ని అనుభవించిన తర్వాతనే అర్థం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో చైతన్య నిహారిక ని ఏ విషయం లో అయినా నమ్మించి మోసం చేశాడా అనే కోణం లో ఆలోచిస్తున్నారు అభిమానులు. చైతన్య కూడా గత కొంతకాలంగా ఒక అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.