Niharika Konidela : సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎల్లప్పుడూ తన స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేసే అలవాటు ఉన్న నిహారిక, ఈసారి తన ట్రిప్ ని థాయిలాండ్ లో ప్లాన్ చేసింది. అక్కడ అడవుల్లో తిరుగుతూ ఆమె కాసేపు ఏనుగులకు సంరక్షకురాలిగా మారిపోయింది. అక్కడ ఉన్న ఏనుగులకు ఆహరం పెడుతూ, చుట్టూ పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ అలా రోజు మొత్తాన్ని గడిపేసిందట.
ఈ విషయాన్నీ ఆమె నేడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో పంచుకుంది. అంతే కాకుండా, అక్కడ ఉన్న జంతువులూ సురక్షితంగా ఉండాలని అడవిలో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించింది. ఈ ఫోటోలు మరియు వీడియోలను చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ “సెలబ్రిటీలు ఎక్కువగా థాయ్ లాండ్ వెళ్తే అక్కడ బీచ్ లు, థాయ్ మసాజ్ లతో ఫుల్‌గా చిల్ అవుతారు. కాని నిహారిక ఈవిధంగా వైల్డ్ లైఫ్ గడపటం చూస్తుంటే ఈమెకి జీవితం మీద వైరాగ్యం కలిగిందా” అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.