NIA Raids : దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)మంగలవారం సోదాలు నిర్వహించింది. పంజాబ్,హర్యానా మధ్యప్రదేశ్,రాజస్థాన్,చండీగఢ్ లోని 30 ప్రదేశాలలో దాడులు చేసింది. ఆయా రాష్ట్ర పోలీసు బలగాలతో కలిసి సోదాలు చేశారు.
ఈ 30 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జనవరిలో NIA నిషేధిత సంస్థలైన బబ్బ ర్ ఖల్సా ఇంటర్నేషనల్ లారెన్స్ బీష్ణోయ్ గ్యాంగ్ కు సంబందించిన మూడూ కేసులకు సంబందించిన అక్రమ ఆయుధాలు,మందుగుండు సామాగ్రి నేరారోపణ పత్రాలు ,డీజిటల్ పరికరాలు,నగదు కోసం సోదాలు చేశారు.
ఉగ్రవాదం,మాఫీయా నేట్ వర్క్ లను చేధించడమే లక్ష్యంగా ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాల,పర్థీప్ కుమార్ వంటి సామాజిక నాయుకుల, ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలుస్తోంది.