Ratan Tata : తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు వచ్చిన వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. జనరల్ చెకప్ కోసం మాత్రమే తాను వెళ్లినట్లు చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సోమవారం ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆయన, తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఐసీయూలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. వృద్ధాప్యానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మాత్రమే తనకు ఉన్నాయన్నారు. బాధ్యత గల మీడియా తప్పుడు సమాచారం ప్రచారం చేయకుండా ఉండాలని సూచించారు.