wedding planners : పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే అటు ఏడుతరాలు.. ఇటు ఏడు తరాలు చూసి మరీ సంబంధాలు కలుపుతుంటారు. అయితే ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ లాగానే పెళ్లిళ్లు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. వేగంగా మూహూర్తాలు పెట్టేయడం.. అంతే వేగంగా పెళ్లిళ్లు చేసేయడం చేస్తున్నారు. అందుకే కాపురాలు కూడా సాగక అంతేవేగంగా విడాకులకు దారితీస్తున్నాయి..
అయితే ఉత్తరప్రదేశ్ లో ఓ జంట తమకు పెళ్లి చేసిన పంతులుపై కేసు వేశారు. మంచి ముహూర్తం పెట్టలేదని.. అందువల్లే తమ మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నామని పోలీసు స్టేషన్ లో కేసు వేశారు. దీంతో పెళ్లి చేయడమే తప్పు అయిపోయింది కదరా అంటూ పంతులు నిట్టూర్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.