UAE Telugu Association : యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం
UAE Telugu Association : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తెలుగు వారి కోసం నిర్వహిస్తున్న సంస్థ యూఏఈ తెలుగు అసోసియేషన్. ప్రముఖంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ప్రవాస భారతీయులకు ఈ సంస్థ యూఏఈలో సేవలు అందిస్తుంది. సంస్థ ద్వారా సామాజిక, సాంఘిక, సంస్కృతిక ఇలా చాలా రకాల సేవలు చేసుకుంటూ వెళ్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలుగు వారి కోసం పని చేసే సంస్థ.
ఈ అసోసియేషన్ కు సంబంధించి ఇటీవల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం ప్రమాణ స్వీకారం సోమవారం (నవంబర్ 20)వ తేదీ జరిగింది. తెలుగు వారి ఆధ్వర్యంలో దుబాయ్ లోని రాయల్ కాంకర్డ్ హోటల్‌లో వైభవంగా నిర్వహించినట్లు అసోసియేషన్ మీడియా డైరెక్టర్ అబ్దుల్ ఫహీమ్ షేక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసోసియేషన్ చైర్మన్ గా వివేకానంద బలుస గారు, అధ్యక్షుడిగా మసివుద్దీన్ మొహమ్మద్ గారు, ఉపాధ్యక్షుడిగా సుదర్శన్ కటారు గారు, ప్రధాన కార్యదర్శిగా విజయ భాస్కర్‌రెడ్డి గారు, కోశాధికారిగా శ్రీనివాస్‌గౌడ్ రాచకొండ గారు, మార్కెటింగ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్‌రావు ఎండూరి గారు, అంతర్జాతీయ వ్యవహారాల విభాగ డైరెక్టర్‌గా సురేంద్రనాథ్ ధనేకుల గారు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా శ్రీధర్ దామర్ల గారు, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా చైతన్య చకినాల గారు ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయుల తెలుగు సంఘం (ఏపీఎన్‌ఆర్‌టీ), గల్ఫ్ మైనార్టీ కమిటీ (జీఎంసీ) సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. యూఏఈలో తెలుగువారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా కమిటీ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.