JAISW News Telugu

Viveka Murder Case:వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో కొత్త ట్విస్ట్‌

Viveka Murder Case:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
వివేకా కుమార్తె సునీత‌, ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివేకా హ‌త్య కేసులో కొంద‌రు త‌న‌ని బెదిరిస్తున్నార‌ని ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి గ‌తంలో పులివెందుల కోర్టును ఆశ్ర‌యించారు. కొంద‌రు నేత‌ల పేర్లు చెప్పాల‌ని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్న‌ట్లు పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

వివేకా హ‌త్య కేసులో పులివెందుల‌కు చెందిన కొంద‌రు నాయ‌కుల ప్ర‌మేయం ఉంద‌నేలా సాక్ష్యం చెప్పాల‌ని… ప్ర‌త్యేకించి ఎస్పీ రాంసింగ్ త‌న‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని అప్ప‌ట్లో పిటీష‌న్‌లో వివ‌రించారు. సీబీఐ అధికారుల‌కు అనుకూలంగా సాక్ష్యం చెప్పాల‌ని వివేకా కుమార్తె సునీత‌, అల్లుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌పై ఒత్తిడి తెచ్చార‌ని ఆయ‌న ఆరోపించారు. న్యాయం చేయాల‌ని అప్ప‌ట్లో ఎస్పీగా ఉన్న అన్భురాజ‌న్‌ను క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసుల‌ను కోరినా ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డంతో కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని పిటీష‌న్‌లో పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సునీత‌, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, రాంసింగ్‌ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు ఐపీసీ సెక్ష‌న్ 156 (3) కింద పులివెందుల పోలీసులు శ‌నివారం కేసు న‌మోదు చేశారు.

Exit mobile version