H-1B Visa : H-1B వీసాలకు అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలు.. అవేంటంటే?
H-1B Visa : H-1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులువు, పారదర్శకత్వం, కచ్చితత్వం చేయడం, మోసాలను నివారించడం కోసం యునైటెడ్ కంట్రీస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సీఐఎస్) 2025 ఆర్థిక సంవత్సరానికి (ఎఫ్ఐ 2025) H-1B పరిమితికి తుది నిబంధనను ప్రకటించింది.
లబ్ధిదారుల తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా అందరికీ నిష్పాక్షికంగా, సమాన అవకాశాలు కల్పించేలా ఎంపిక ప్రక్రియలో నిబంధన ప్రవేశపెడుతోంది. ఇకపై ప్రత్యేక లబ్ధిదారుల ఆధారంగా రిజిస్ట్రేషన్లను ఎంపిక చేయడం ద్వారా మోసాలకు ఆస్కారం లేకుండా, సమాన అవకాశాలు కలుగుతాయి. 2025 ఆర్థిక సంవత్సరం ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధితో ప్రారంభించి, ప్రతి లబ్ధిదారుడికి చెల్లుబాటయ్యే పాస్ పోర్ట్ సమాచారం చెల్లుబాటయ్యే ప్రయాణ డాక్యుమెంట్ సమాచారాన్ని అందించాలని రిజిస్టర్లను యూఎస్సీఐఎస్ తప్పనిసరి చేస్తుంది.
H-1B పరిమితికి లోబడి కొన్ని పిటీషన్లపై కోరిన ఉద్యోగ ప్రారంభ తేదీకి సంబంధించిన ఆవశ్యకతలను తుది నిబంధన స్పష్టం చేస్తుంది. సంబంధిత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1 తర్వాత వెలువరించిన ప్రారంభ తేదీలతో దాఖలు చేయడానికి అనుమతిస్తుంది.
H-1B వీసాల రిజిస్ట్రేషన్ లో తప్పుడు ధ్రువీకరణ ఉంటే లేదంటే చెల్లకపోతే తిరస్కరించే లేదా రద్దు చేసే యూఎస్సీఐఎస్ సామర్థ్యాన్ని ఈ నిబంధన క్రోడీకరించింది. 2025 ఆర్థిక సంవత్సరం H-1B పరిమితికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి తర్వాత అమల్లోకి వచ్చే ఫీజు షెడ్యూల్ తుది నిబంధనను కూడా యూఎస్ సీఐఎస్ ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం H-1B క్యాప్ కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6న ప్రారంభమవుతుంది మార్చి 22, 2024 వరకు ఉంటుంది.
యూఎస్సీఐఎస్ 2024, ఫిబ్రవరి 28న సంస్థాగత ఖాతాలను ప్రారంభించనుంది. ఇది H-1B రిజిస్ట్రేషన్లు పిటీషన్లు, అనుబంధ ఫారాలపై సహకారాన్ని అనుమతిస్తుంది. నాన్ క్యాప్ H-1B పిటీషన్ల కోసం ఫారం ఐ-129, ఫారం-127 ఆన్ లైన్ ఫైలింగ్ కూడా అదే తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. పిటీషనర్లు ఫారం ఐ-129 H-1B పిటిషన్లను దాఖలు చేయవచ్చని, ఆన్ లైన్ ఫైలింగ్ ఆప్షన్లు 2024, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఈ రంగాల్లో మెరుగుదల పిటీషనర్లు, లబ్ధిదారులకు H-1B ఎంపికలను మరింత సమానంగా మారుస్తాయని, రిజిస్ట్రేషన్ నుంచి తుది నిర్ణయం వరకు H-1B ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఉండేలా చూస్తామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ మీ ఎం జడ్డౌ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు మొత్తం H-1B ప్రోగ్రామ్ ను మరింత మెరుగుపరచడం, పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా చేస్తుందని ఆయన తెలిపారు.