IPL 2024 : ఐపీఎల్ లో అంచనాలు తప్పుతున్నాయి. గెలుస్తుందనుకున్న మ్యాచ్ లు ఓడుతున్నాయి. ఓడుతుందనుకున్న మ్యాచ్ లు గెలుస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు అదరగొట్టింది. వరుస మ్యాచ్ ల్లో ఓడినా చివరకు విజయం సాధించింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి పంజాబ్ మూడు వికెట్ల తేడాతో గెలుపు ముంగిట నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు సాధించిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ అత్యధిక పరుగులతో అలరించాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మెరుపు వేగంతో విజయం సాధించారు. 19.5 ఓవర్లలోనే 200 పరుగులు చేశారు. రెండు వరుస ఓటముల తరువాత గుజరాత్ టైటాన్స్ సొంత గడ్డపైనే ఓడించడం గమనార్హం. డెత్ ఓవర్లలో కూడా చెలరేగి ఆడారు. చివరకు విజయం సాధించారు. అనుకున్న లక్ష్యం చేరుకున్నారు. గుజరాత్ ను ఓడించడం ద్వారా అనుభూతి పొందారు.
ఇందులో భారత్ ప్లేయర్లు శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అశుతోష్ రాణా మంచి ఆటను ప్రదర్శించారు. మ్యాచ్ గెలవడంతో శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో 35, అశుతోష్ రాణా 17 బంతుల్లోనే 37 పరుగులు చేయడం విశేషం. మ్యాచ్ గెలవడంలో ప్రధాన భూమిక పోషించారు. పంజాబ్ కు కీలకమైన విజయం అందించారు.
దీంతో పంజాబ్ కు విజయం దక్కింది. వరుస ఓటములతో బాధపడుతున్న పంజాబ్ కు ఎట్టకేలకు విజయం కిక్ ఇచ్చింది. ఐపీఎల్ లో పంజాబ్ కు గెలుపు సాధించడంలో ఆటగాళ్లు సమష్టిగా ఆడారు. ప్రత్యర్థిని బెదరగొట్టారు. విజయం ముంగిట నిలిచారు. ఇలాంటి రికార్డులు చెన్నై, ముంబై కానీ సాధించలేకపోవడం గమనార్హం.