Tirumala laddu : తిరుమల లడ్డూ కౌంటర్లలో కొత్త విధానం.. స్కానింగ్ మెషీన్ల ఏర్పాటు
Tirumala laddu Counters : తిరుమలలో లడ్డూ ప్రసాదం కౌంటర్లలో కీలక మార్పులు చేసింది. భక్తులకు లడ్డూలు అందించే విధానంలో ఆధార్ వివరాలను నమోదు చేస్తోంది. ఈ మేరకు స్కానింగ్ మెషీన్లను కౌంటర్లలో ఏర్పాటు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు లడ్డూలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరు కౌంటర్లలో ఈ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రాబోయే రోజుల్లో మిగిలిన కౌంటర్లలో ఏర్పాటు చేయనున్నారు.
టీటీడీ ఐటీ విభాగం తిరుమల లడ్డూ ప్రసాదం కౌంటర్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించే పనిలో ఉంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలను ప్రస్తుతం ఆధార్ కార్డ్ ఆధారంగా అందిస్తున్నారు. కొండపై కౌంటర్లలో ఒక్కో భక్తుడికి రెండేసి లడ్డూల చొప్పున టీటీడీ ఇస్తోంది. దీని కోసం ప్రసాదం కౌంటర్ లోని కంప్యూటర్ లో భక్తుల ఆధార్ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు ఆధార్ కార్డ్ ల స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో ఆరు (51 నుంచి 61) లడ్డూ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు.