Real traders : కొత్తరకం మోసానికి తెర.. రియల్ వ్యాపారుల నమ్మి డబ్బు పెడితే.. ఇక పోయినట్టే
న్యాయపరమైన చిక్కులను అర్థం చేసుకోకుండా అత్యాశతో కొందరు కొనుగోలుదారులు తరచూ ఇలాంటి ఉచ్చుల్లో పడుతుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు బై బ్యాక్ స్కీమ్స్ ఆఫర్ చేయడం ద్వారా లేదంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేయడం ద్వారా డబ్బును సేకరించడానికి చట్టం అనుమతించదు. ఇది చట్టవిరుద్ధం. ఈ ప్రాజెక్టుల 3డీ యానిమేటెడ్ వీడియోలు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు చూపిస్తారు. ‘భూతల స్వర్గం’ అని భ్రమ కల్పించి 40 శాతం పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు.
ఏడాదిలోగా తమ డబ్బు రెట్టింపు అవుతుందని భావించి కొందరు ఇలాంటి ప్రాజెక్టుల్లో రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ చివరికి ఈ కంపెనీలు కనుమరుగై ఇన్వెస్టర్లు మోసపోతున్నారు. బాధితులు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)ని సంప్రదిస్తే ఆ ప్రాజెక్టులు రెరాలో నమోదు కాకపోవడంతో అవి కూడా ఏమీ చేయలేమని చెప్తున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మోకిల ప్రాంతాల్లో ఇలాంటివి పెద్ద ఎత్తున జరుగుతోంది. కొనుగోలుదారులు తస్మాత్ జాగ్రత్త!