Earthquake New Jersey : వణికిన న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాలు

Earthquake New Jersey
- రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం..
Earthquake New Jersey : భారీ భూకంపానికి అమెరికా చిగురుటాకులా వణికింది. నైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, న్యూయార్క్ నగరం శుక్రవారం చిన్న భూకంపం 4.8 తీవ్రతతో కంపించింది. పొరుగున ఉన్న న్యూజెర్సీ రాష్ట్రంలో భూకంప కేంద్రాన్ని కలిగి ఉన్నట్టు తేలింది.. ఈ భూకంపం వచ్చిన వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. గాయాలు లేదా నష్టం గురించి ప్రాథమిక నివేదికలు లేవు.

Earthquake New Jersey
భూకంపం ధాటికి బ్రూక్లిన్‌లోని భవనాలు కంపించాయి. అల్మారా తలుపులు ఫిక్చర్‌లు ధ్వంసమయ్యాయి. న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఐక్యరాజ్యసమితిలో గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా.. ఈ భూకంపం వచ్చింది. ప్రకంపనల తర్వాత తాత్కాలికంగా సమావేశం నిలిపివేయబడింది.
ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్ వరకు మరియు తూర్పు వైపు లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించినట్లు సోషల్ మీడియాలో వీడియోలతో సహా వినియోగదారులు పోస్ట్ చేస్తున్నారు.