New industrial policy : వాళ్లకు ఇష్టముంటే వాళ్లే వస్తారు.. పరిశ్రమలు పెట్టాలనుకుంటే పెడతారు.. అనేతి గత జగన్ ప్రభుత్వ పాలసీ.. పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేయం.. ఛార్టెడ్ ఫ్లైట్ పెట్టేది లేదని గత ప్రభుత్వం అనుకునేది. 2014-19 మధ్య కాలంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అందుకోలేకపోయింది. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా వస్తే.. వాటాలు అడిగే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏపీకి సరికొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రాన్ని మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్లుగా ఏపీ ఇమేజ్ పై పడిన మరకలను తుడిచేసి .. కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు పరిశ్రామిక వేత్తలు చంద్రబాబుతో సమావేశమై తమ పెట్టుబడుల ప్రణాళికల గురించి వివరించారు. గతంలో ప్రతిపాదనలు చేసుకుని జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి వెళ్లిపోయిన వారితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
ఏపీలో మారిన పరిస్థితులను బట్టి మరింత కొత్త ఇండస్ట్రీయల్ పాలసీ అవసరమని సర్కార్ భావిస్తోంది. అందుకే కొత్త పారిశ్రామిక విధానం పై కసరత్తు చేస్తోంది. పరిశ్రమలకు ప్రోత్సహకాలు ఇచ్చేలా.. ప్రభుత్వ పరంగా కానీ.. మరో విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. గత ప్రభుత్వం వాటాలు అడిగే సరికి జాకీ లాంటి పరిశ్రమ యూనిట్ నిర్మాణం ప్రారంభించి కూడా వెళ్లిపోయింది. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పారిశ్రామికవేత్తలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రత్యేక వ్యవస్థ,. వారి సమస్యలను ఎప్పటికప్పుడు గ్రీవెన్స్ చేయడానికి స్పెషల్ టీం రెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త పాలసీలో కొన్ని ప్రత్యేకమైన రంగాలకు భారీ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈవీ, ఐటీ రంగాలకు ప్రోత్సాహకాలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్ రూ.60వేల కోట్ల వరకూ పెట్టుబడి పెట్టనుంది . ఇక బ్రూక్ ఫీల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ, విన్ ఫాస్ట్ ఈవీ, ఫాక్స్ కాన్ ఈవీ , గోద్రెజ్, టీసీఎస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, జెడ్‌టీఈ, ఆరియా గ్లోబల్ , మను జైన్ ఇండియా హెడ్ గా ఉన్న ఎం42, హెచ్‌సీఎల్, సుజలాన్ వంటి కంపెనీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వచ్చాయి. వీరి ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్లేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని చంద్రబాబు రూపొందిస్తున్నారు.