Student Visa : విదేశాల చదువులకు కొత్త మార్గదర్శకాలు
Student Visa Rules : ప్రస్తుతం విదేశాల్లో చదువుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి కోర్సులో చేరి మంచి ఉద్యోగం సంపాదించుకుని విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. డాలర్లు, పౌండ్లు, యెన్ లు సంపాదించాలనే యావలోనే చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకు తరలిపోతున్నారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్ క్లేవ్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 23 ప్రకారం 1.3 మిలియన్ విద్యార్థులు విదేశాల బాట పడుతున్నారు.
భారతీయ విద్యార్థులు వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ప్రముఖమైనది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో 1.09 లక్షల విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఐఈఎల్ టీఎస్, టోఫెల్, డ్యూలింగో, ఇంగ్లిష్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెళ్తున్నారు. టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాకు ఐఈఎల్ టీఎస్ స్కోర్ 6.0 నుంచి 6.5కు, స్టూడెంట్ వీసా స్కోర్ 5.5 నుంచి 6.0కు పెంచారు. స్టూడెంట్ వీసా బ్యాంక్ డిపాజిట్ మొత్తం 24,505 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.
దేశం నుంచి యూకేకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్యను తగ్గించేందుకు యూకే నిబంధనలు అమలు చేస్తున్నా తగ్గడం లేదు. యూకే రుసుములను ఇండియన్ కరెన్సీలో రూ.51,787 చెల్లించాల్సి ఉన్నా సంఖ్య తగ్గడం లేదు. ఫ్రాన్స్ లో మాస్టర్స్ లో చేరేందుకు మన విద్యార్థులు చాలా మందే వెళ్తున్నారు. మాస్టర్స్ చదివిన వారికి ఐదేళ్లు షార్ట్ స్టే స్కెంజెన్ వీసా పొందవచ్చు.
మనదేశ విద్యార్థులు ఎంపిక చేసుకునే దేశాల్లో ఐర్లండ్ ఒకటి. బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసా కోసం రెండేళ్ల పాటు ఉండొచ్చు. 2022లో ఇటలీలో 5,897 మంది విద్యార్థులు విద్యనభ్యసించేందుకు వెళ్లారు. ఇటాలియన్ లాంగ్వేజ్ లో ప్రొఫెషనల్, ఇంటర్న్ షిప్ లు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
భారతీయ విద్యార్థుల్లో చాలా మంది కెనడా బాట పడుతున్నారు. కెనడాలో విధించిన కొత్త తరహా నిబంధన, మోసాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల కనీస జీవన వ్యయాన్ని 10 వేల కెనడియన్ డాలర్ల నుంచి 20,635 డాలర్లకు పెంచారు. అమెరికా కూడా కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. వీసా అపాయింట్ మెంట్ షెడ్యూల్ సమయంలో సొంత పాస్ పోర్ట్ సమాచారం వెల్లడించాలి. ప్రొఫైల్ తప్పుగా నమోదు చేస్తే పాస్ పోర్ట్ రద్దు చేస్తారు. వీసా రుసుమును కోల్పోయే అవకాశం ఉంటుంది.