Culture in Hyderabad : హైదరాబాద్ లో కొత్త కల్చర్.. అశ్లీల నృత్యాలు చేస్తూ పట్టుబడ్డ 42మంది మహిళలు

New Culture in Hyderabad
Culture in Hyderabad : హైదరాబాద్‌లో కొత్త సంస్కృతి మొదలైంది. బంజారాహిల్స్‌లోని పలు పబ్బుల్లో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. టాస్ పబ్‌లో యువతుల అశ్లీల నృత్యాలు చూసి షాకయ్యారు. యువతులతో పబ్బులకు వచ్చే కస్టమర్లను ట్రాప్ చేసి అధిక బిల్లులు వసూలు చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి 149 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 42 మంది యువతులు, ఏడుగురు మేనేజర్లు, 100 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.