JAISW News Telugu

Corona Alert:తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కొత్త వేరియంట్‌ క‌ల‌క‌ల‌కం

Corona Alert:తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కొత్త వేరియంట్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. కేర‌ళ‌లో తొలి సారి కొత్త వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయ‌ని ఇటీవ‌ల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా కొత్త వేరియంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఇందు కోసం రాష్ట్రాలు సిద్ధంగా ఉండాల‌ని కేంద్రం రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. అయినా స‌రే కొత్త వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతూ ప్ర‌జ‌ల్లో భాయాందోళ‌న‌లు క‌లిగిస్తున్నాయి.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కొత్త వేరియంట్‌కు సంబంధించిన కేసులు న‌మోదు కావ‌డం మొద‌లైంది. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కొన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైంది. ఏపీలో తాజాగా రెండు కేసులు న‌మోద‌య్యాయి. తూర్పు గోదావ‌రి జిల్లారాజ‌మండ్రిలో తొలి కోవిడ్ కేసు న‌మోద‌యింది. 85 ఏళ్ల మ‌హిళ‌కు కోవిడ్ సోకిన‌ట్టుగా స‌మాచారం. శ్యాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.

ఏలూరులో మ‌రో కేసు న‌మోదయింది. కొత్త వేరియంట్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ర్యాండ‌మ్‌గా ఆరుగురికి టెస్టులు చేసిన వైద్యులు ఓ ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీ వైద్యుడికి కోవిడ్ సోకిన‌ట్టుగా నిర్ధారించారు. అత‌డి సంబంధించిన టెస్టుల‌ను హైద‌రాబాద్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, ప్ర‌జ‌లు ఎలాంటి ఆందోళ‌న ప‌డ‌వ‌ద్ద‌ని డీఎం అండ్‌ హెచ్ ఓ తెలిపారు. పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తి వేరే రాష్ట్రాల‌కు ఎక్క‌డికి వెళ్లి రాలేద‌న్నారు.

ఇదిలా ఉంటే తాజాగా హైద‌రాబాద్‌లోని నిలోఫ‌ర్ ఆసుప‌త్రిలో ఇద్ద‌రు చిన్నారులు క‌రోనా బారిన ప‌డ్డారు. నాలుగైతు రోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రం, ఊపిరి పీల్చుకోవ‌డానికి ఇబ్బందులు పుడ‌తున్నారు. అంతే కాకుండా 14 నెల‌ల చిన్నారికి కూడా క‌రోనా సోకింది. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా 20 యాక్టీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

Exit mobile version