JAISW News Telugu

Gautam Gambhir : ద్రవిడ్ మేసేజ్ తో భావొద్వేగానికి లోనైన కొత్త కోచ్ గౌతం గంభీర్

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir : భారత క్రికెట్ కోచ్ లో నూతన అధ్యాయం మొదలైంది. కోచ్ గా మాజీ బ్యాటర్ చాంపియన్ గౌతం గంభీర్ బాధ్యతలు స్వీకరించారు. అయితే మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వీరికి ఒక సందేశం పంపించాడు. శ్రీలంక టూర్ కు ఇండియా వెళ్లింది. మొదటి సారి కోచ్ గా గౌతం గంభీర్ నేతృత్వంలో టీం ఇండియా ఒక సిరీస్ కు వెళ్లింది. కాగా మాజీ కోచ్ ద్రవిడ్ గంభీర్ కు ఒక పాజిటివ్ సందేశాన్ని పంపించాడు.

టీం ఇండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ధన్యవాదాలు గౌతం గంభీర్. అత్యంత ఉత్సాహవంతమైన కోచ్ పదవిలోకి ఆహ్వానం పలుకుతున్నాను. టీం ఇండియా క్రికెట్ జట్టుతో మంచి క్షణాలు అనుభవించాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. టీం ఇండియా కోచ్ గా తనకు బార్బడోస్ విజయం మరుపురానిదని, తాను కన్న కలలు నిజమయ్యాయని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం ముంబయి లో జరిగిన సంబరాలు కూడా నన్ను ఎంతో బావోద్వేగానికి గురి చేశాయని ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు.
ఫిట్ గా ఉండే ఆటగాళ్లు నీకు అందుబాటులో ఉంటారని, దీని కోసం కాస్త కష్టపడాల్సి ఉంటుందని చెప్పాడు. తోటి ఆటగాడిగా, బ్యాటింగ్ ఫీల్డింగ్ లో నీ వ్యక్తిత్వం దగ్గరి నుంచి చూసిన వాడిగా టీం ఇండియాను అగ్ర స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటున్నానని చెప్పాడు. నీకు అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భారత క్రికెట్ కోసం ఎంతో అంకిత భావంతో పని చేసే నీకు కలిసి రావాలని ఆశిస్తున్నానని సందేశం పంపాడు.
ఆటగాళ్లు, టీం సహచరులు, సపోర్టు స్టాప్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని ముగించాడు. దీంతో గౌతం గంభీర్ బావోద్వేగానికి గురయ్యాడు.  గంభీర్ మాట్లాడుతూ..  రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ కు మార్గదర్శి అని అన్నాడు. రాహుల్ బాయ్ గర్వపడేలా టీంను నడిపిస్తానని పేర్కొన్నాడు.
Exit mobile version