Lucknow Super Giants : స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్ సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాను కలిశారు. వీరిద్దరూ చాలా సేపు సమావేశమయ్యారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాహుల్, ఫ్రాంచైజీ యజమాని మధ్య సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించకుంది. ఎల్‌ఎస్‌జీ రాబోయే సీజన్‌లో రాహుల్‌ను కొనసాగించకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి భేటీ తర్వాత రాహుల్‌ను తమ వద్దే ఉంచుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ -2024లో ఎల్ఎస్ జీ పేలవమైన ఆటతీరుతో విమర్శల పాలైంది. లక్నో 14 మ్యాచులు ఆడగా, అందులో ఏడింట్లో ఓడిపోయింది. మే 8న, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఓటమి తర్వాత, ప్రాంఛైజీ యజమాని గోయెంకా మైదానంలో అందరి ముందు రాహుల్‌పై విరుచుకుపడ్డాడు, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ సంఘటన తర్వాత, రాహుల్- గోయెంకా మధ్య ఇది మొదటి అధికారిక సమావేశం. అయితే రాహుల్ ఎల్‌ఎస్‌జీలో కొనసాగాలనుకుంటున్నారా లేదా అనేది మాత్రం వెల్లడించలేదు. రాహుల్ ఏ కొత్త బాట పట్టనున్నారు? ఇది కూడా రానున్న రోజుల్లో తేలనుంది.
ఎల్ఎస్ జీ కెప్టెన్ రేసులో ఇద్దరు?
అయితే ఎల్ఎస్ జీ కెప్టెన్ రేసులో ఇద్దరు క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరు కృనాల్ పాండ్యా, మరొకరు నికోలస్ పూరన్. వీరిద్దరూ కూడా సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నికోలస్ పూరన్ ఐపీఎల్ లో2024లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 106 మీటర్ల ఎత్తయిన షాట్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. హయ్యెస్ట్ హైట్ సిక్సర్లలో ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది.